Telangana DSC 2024 Results: తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై పూర్తి దృష్టి సారించామని.. 30 రోజుల్లో 30 ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది తమ ప్రజా పాలనకు నిదర్శమని.. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోవడం ఇలా..


డీఎస్సీ-2024కి సంబంధించిన 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు  అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'దసరాలోపు డీఎస్సీకి సంబంధించిన పూర్తి నియామకాలు పూర్తి చేస్తాం. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తాం' అని ప్రకటించారు. పదేళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమేనని తెలిపారు.

Also Read: HYDRAA Bandi Sanjay: నా ప్రాణం తీశాకే 'హైడ్రా' పేదోళ్ల ఇళ్లు కూల్చాలి: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు


 


'విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. మేం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టాం. విద్యకు మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11,062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నాం' అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది విద్యపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని పేర్కొన్నారు. 
తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష' అని చెప్పారు.


'అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ  నిర్వహించాం. టీజీపీస్సీని ప్రక్షాళన చేశాం. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం. మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.


'టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదు.. అది భావోద్వేగం. గత పదేళ్లలో విద్య నిర్లక్ష్యానికి గురైంది. మేం వచ్చాక విద్య శాఖకు నిధుల కేటాయింపు పెంచాం. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తాం. మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. 100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు చేస్తున్నాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.


'మా ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసింది. విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని మేం భావిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయంలేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తాం. పేదలకు విద్య అందించడమే మా విధానం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.