Pakistan Become No 1 ODI Team: ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్‌ టీమ్‌గా అవతరించింది. ఆఫ్ఘనిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంతో నెంబర్ ర్యాంక్ పాక్ సొంతమైంది. శ్రీలంకలోని మొదటి రెండు మ్యాచ్‌లు హంబన్‌తోటలో.. మూడో మ్యాచ్ కొలంబోలో జరిగింది. తొలి వన్డేలో చేతులెత్తేసిన ఆఫ్ఘన్.. రెండో వన్డేలో గట్టిపోటీనిచ్చింది. అయితే మూడో వన్డేల్లో మళ్లీ పాక్‌కు ఈజీగా తలవంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 268 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఠనిస్థాన్‌ 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతోపాటు వన్డేల్లో నెంబర్ వన్ టీమ్‌గానూ నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్ జట్టు వరుసగా వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌ను 2-1తో ఓడించగా.. గతే ఏడాది వెస్టిండీస్, నెదర్లాండ్స్‌లను వరుసగా 3-0తో సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది. ఏప్రిల్‌లో ఐదు వన్డేల సిరీస్‌లో  కివీస్‌ను పాకిస్థాన్‌ 4-1తో మట్టికరిపించి.. నంబర్ 1 ర్యాంక్‌కు చేరువైంది. ఆఫ్ఘనిస్థాన్‌పై సిరీస్‌ గెలవడంతో మొదటిస్థానంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. 


పాకిస్థాన్ టీమ్‌ ఖాతాలో 118.48 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఆస్ట్రేలియా 118 రేటింగ్‌ పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. ఇక భారత్ 113 రేటింగ్ పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. న్యూజిలాండ్ (104), ఇంగ్లండ్ (101) నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


ఆసియా కప్‌లో నెం. 1 ర్యాంక్‌గా పాకిస్థాన్ ప్రవేశిస్తుండగా.. భారత్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. 119 రేటింగ్ పాయింట్‌లతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. సెప్టెంబర్‌ 2న భారత్‌తో ఓడిపోతే ఆ జట్టు రెండవ స్థానానికి పడిపోయే అవకాశం ఉంది. ఆసియాకప్ తరువాత వన్డే ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.


Also Read: Hyundai Creta: హ్యుండయ్ క్రెటాలో తక్కువ ధర మోడల్ ఇదే, ఫీచర్లు ఇలా ఉన్నాయి


Also Read: Surya Dev: ఆదివారం ఈ పరిహారంతో జీవితంలో అదృష్టం, డబ్బు, గౌరవాన్ని పొందండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook