.
Surya Dev Sunday Remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..అన్ని గ్రహాలకు రాజుగా పిలిచే సూర్య భగవానుడికి ఆదివారం అంకితం చేశారు. అందుకే హిందువు భక్తులంతా సూర్య దేవుడిని ప్రతి ఆదివారం పూజిస్తారు. ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్య సమర్పించి, పూజించడం వల్ల జీవితంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.జాతకంలో సూర్య గ్రహ స్థానం బలంగా ఉన్నప్పుడు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు జీవితంలో కీర్తి, ఆనందం కూడా పెరుగుతుంది. కాబట్టి సూర్యుడు మీ జాతకంలో కూడా బలంగా ఉండడానికి ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఇలా పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ఆదివారం సూర్య భగవానుడికి చేయాల్సిన పరిహారాలు:
❃ ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఇలా లేచి మీ దగ్గరలో ఉన్న నది వద్ద స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. స్నానం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది.
❃ అర్ఘ్యం సమర్పించే క్రమంలో ఆ రాగి పాత్రలో ఉన్న నీటిలో ఎర్రటి పూలు, అక్షత ఎర్రచందనం, నల్ల నువ్వులను కలిపి సమర్పించాలి. ఇలా ప్రతి ఆదివారం చేయడం వల్ల వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సమజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
❃ సూర్యభగవానునికి అర్ఘ్య సమర్పణ చేస్తూ.. 'ఓం భాస్కరాయ నమః' 'ఓం సూర్యాయ నమః' 'ఓం ఆదిత్యాయ నమః' అనే మంత్రాలను పఠిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ సులభంగా తీరతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
❃ సూర్య దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రతి అదివారం ఎరుపు రంగుతో కూడిన దుస్తువులను ధరించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
❃ మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతి ఆదివారం ఎరుపు రంగు వస్త్రాలు, నెయ్యి, బెల్లం దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవిత౦లో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
❃ సూర్యునిలా ప్రకాశవంతంగా బుద్ధి పొందడానికి ప్రతి ఆదివారం మర్చిపోకుండా నుదుటిపై ఎర్రచందనం తిలకాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.
❃ ఇంట్లో ఆనందం, సంపదలు పెరడానికి ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుంది. దీంతో పాటు సాయంత్రం పూట భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి