హైదరాబాద్ కాచిగూడలో పెళ్లి పేరుతో ఉపేంద్ర వర్మ అనే పాన్ షాప్ యజమాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వలలో వేసుకున్నాడు. పార్కులు, హోటళ్లకు తిప్పుతూ ఆమెను నమ్మబలికించాడు. ఓ రోజు స్వీట్‌పాన్‌లో మత్తు మందు కలిపి యువతికి ఇచ్చాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీశాడు. అనంతరం తన మాట వినకపోతే వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు ఉపేంద్ర వర్మపై అత్యాచార కేసుతో పాటు పలు కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉపేంద్ర వర్మకు సహకరించిన అతని స్నేహితుడితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.