Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు విపక్షాలన్ని జనంలోనే ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలతో మంత్రులు జిల్లాలు చుట్టేస్తుండగా.. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమంటున్న కాంగ్రెస్.. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి సహా ముఖ్య నాయకులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీసీసీ ముఖ్య నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. ఈ అంశంపై 15వ తేదీన అల్ పార్టీ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశానికి బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే అన్నారు. దీనిపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్పందించాలన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదన్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసీలు ఇచ్చారని మండిపడ్డారు. ఈడీ నోటీసులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాహుల్ గాంధీ ఈడీ  కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు నిరసన చెబుతామని చెప్పారు.


కాంగ్రెస్ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పని చేయకపోతే పదవులు రావని తేల్చి చెప్పారు. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని అన్నారు. గ్రామాల్లో తిరిగి ప్రతి గడప తట్టాలని సూచించారు. అలాంటి నేతలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్ద నాయకులు బాగా పని చేస్తుంటే.. యువ నాయకులు మాత్రం ప్రజల్లో తిరగడం లేదన్నారు.ఎప్పటికప్పుడు ఏఐసీసీ కి నివేదికలు వెళ్తున్నాయని తెలిపారు. పనిచేసి ప్రజల్లో నిత్యం ఉండే వాళ్లకే పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు రచ్చబండ  కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొగిస్తున్నామని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.


Read also: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్? 


Read also: KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి