KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్?

KCR NEW PARTY: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలు కూడా కేసీఆర్ రాజకీయ ప్రకటనపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ జాతీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 12:43 PM IST
  • కేసీఆర్ జాతీయ పార్టీపై జోరుగా చర్చ
  • కేసీఆర్ పార్టీపై నారాయణ సంచలన కామెంట్లు
  • బీజేపీ కోసమే కేసీఆర్ పార్టీ- నారాయణ
KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్?

KCR NEW PARTY: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలు కూడా కేసీఆర్ రాజకీయ ప్రకటనపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ జాతీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ సక్సెస్ అవుతారా.. ఆసలు ఆయనకు జాతీయ పార్టీని రన్ చేసేంత సీన్ ఉందా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ పార్టీతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో స్పందించారు.

కేసీఆర్ జాతీయ పార్టీ బీజేపీ డైరెక్షన్ లోనే వస్తుందని ఆరోపించారు సీపీఐ నారాయణ. బీజేపీ వ్యతిరేక పార్టీలను చీల్చడానికే ఇదే పనికి వస్తుందని.. అంతిమంగా బీజేపీకి ప్రయోజనం కల్గుతుందని అన్నారు. మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంటున్న కేసీఆర్.. కేంద్ర సర్కార్ పెద్దల సూచనల మేరకే అడుగులు వేస్తున్నారని అనిపిస్తుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తానని కొన్ని రోజులుగా చెబుతున్న కేసీఆర్... కేవలం కాంగ్రెస్ టార్గెట్ గానే రాజకీయం చేశారని విమర్శించారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్లి కేసీఆర్ జరిపిన చర్చల వివరాలను ఉదహరిస్తూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ నారాయణ.

కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతోనే  కేసీఆర్ ఎందుకు చర్చలు జరిపారని నారాయణ ప్రశ్నించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తోనే కలిసి వెళుతున్నాయి. జార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం మిత్రపక్షాలుగా ఉండగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కేసీఆర్ చర్చలు జరిపారు. కేసీఆర్ సమావేశమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్న లీడర్లే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతతోనూ కేసీఆర్ మంతనాలు సాగించారు. ఆమె కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడుతున్న లీడరే. దీనిపైనే కేసీఆర్ ను ప్రశ్నించారు సీపీఐ నారాయణ. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలను ఎందుకు కలవలేదని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  తనకు సన్నిహితుడని పలు సార్లు ఓపెన్ గానే చెప్పారు కేసీఆర్. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తన మిత్రుడైన జగన్ తో ఎందుకు మాట్లాడలేదని నారాయణ ప్రశ్నించారు. గత మూడేళ్లుగా బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు జగన్. అందుకే జగన్ జోలికి కేసీఆర్ వెళ్లలేదన్నది నారాయణ వాదన. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతానంటున్న కేసీఆర్.. బీజేపీకి ప్రయోజనం కల్గించేందుకు కొత్త అడుగులు వేస్తున్నారని నారాయణ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కు జగన్ మద్దతు కూడా ఉందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ డైరెక్షన్ లోనే కేసీఆర్, జగన్ నడుస్తున్నారన్నది సీపీఐ నారాయణ మాట. 

Read also: KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..

Read also: KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?       

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News