KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్
What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
KCR Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడంపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్ విజయ ప్రస్థానంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్లయ్యిందని తెలిపారు. తిరిగి పునరుత్తేజితంతో మరింతగా ప్రజాదరణను కూడగడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: KCR: బరాబర్ ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే.. రావడమే కాదు 15 ఏళ్లు పాతుకుపోతాం
అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలకు దూరమైన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు చేరువయ్యారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం నైరాశ్యంలో ఉన్న ప్రజలు, పార్టీ శ్రేణుల్లో ధైర్యం ఇస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే తన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం మహబూబాబాద్, మేడ్చల్, నల్గొడ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిష్టిపోయింది.. ఇంక మంచి శకునములు రానున్నాయని పేర్కొన్నారు.
Also Read: Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
టార్చ్‌లైట్‌తో వెతుకుతారు
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాల బీఆర్‌ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాథలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం బయల్దేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఉద్యమకాలంలో సమైక్యాంధ్రలతో ఎలా పోరాటం చేశారో వివరించారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటు వేసి పొరపాటు చేశామంటూ నాలుక కరుసుకుంటున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ సమాజం కోరుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలతో ఛీ కొట్టించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు. 'మరికొద్ది రోజుల్లో టార్చ్‌లైట్ పట్టుకుని జనం వెతుకుంటూ బీఆర్‌ఎస్ పార్టీ కోసం వస్తారు' అని కేసీఆర్ చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter