Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ఇంకా అనేక చోట్ల రూ.100 కు అతి చేరువలో ఉంది. డీజిల్‌ సైతం ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా రూ.100 మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిన్ననే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు సైతం చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fuel prices : ఇప్పటికి 23 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు:
మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 23 సార్లు ఇంధనం ధరలు పెరిగాయి. ఒక్క ఈ జూన్‌ నెలలోనే ఇంధనం ధరలు పెరగడం ఇది ఆరోసారి. మే 4 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా లీటర్ పెట్రోల్‌ ధర రూ.5.81 పెరగ్గా డీజిల్‌ ధర రూ.6.12 మేర పెరిగింది. 


Also read : India Corona Update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు


Petrol prices in Telangana and AP: తెలంగాణ, ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు:
ఇదిలావుండగానే ఇవాళ పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు అనంతరం హైదరాబాద్‌లో (Petrol price today in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.82 వద్ద ఉంది. అలాగే అమరావతిలో (Petrol price today in Vijayawada)) లీటర్ పెట్రోల్ ధర రూ.101.98 గా ఉండగా డీజిల్ ధర రూ.96.32 కి చేరింది.


Petrol prices across india: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో పెట్రోల ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.96.12 గా (Petrol Price today in Delhi) ఉండగా.. డీజిల్ ధర రూ.86.98 కి చేరింది. అలాగే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.30 గా ఉండగా (Petrol Price today in Mumbai) డీజిల్ ధర రూ.94.39 కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 96.06 పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. మరో మెట్రోపాలిటన్ సిటీ అయిన చెన్నైలో పెట్రోల్ ధర రూ.97.43 గా ఉండగా.. డీజిల్ ధర (Fuel rates) రూ. 91.64 కు చేరింది.


Also read : Govt employees salary hike: పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ.. పెరగనున్న జీతాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook