ఈ ఫోటో చూసి ఆశ్చర్యపోకండి..ఇది ఇప్పటిది కాదు.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిన సమయంలో చంద్రబాబుతో కలసి కవిత ప్రచారం చేసిన ఫోటో. ఈ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చినట్లు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తూ.. ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికం..అపవిత్రమంటూ టీఆర్ఎస్ తెగ ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు టీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈ ఫోటో పెట్టి  ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్లు గతంలో టీడీపీతో పొత్తు విషయాన్ని ప్రస్తావిస్తూ..  మీరు చేస్తే చుమత్కారం..ఇతరులు చేస్తే బలత్కారం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 


మూడు కండువాలు గప్పుకుని నిలవడ్డ ఇమె ఎవరో చెప్పండి? ..మరి ఆనాడు టీఆర్ఎస్ వాళ్లుకు టీడీపీ ఆంధ్రా పార్టీ అని తెలయక జతకట్టారా ?... అప్పుడు మీరు చేసింది కరెట్ట్.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు టీడీపీతో కడితే అపవిత్రం..అనైతికం ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు.  సోషల్ మీడియా పుణ్యమాని ఈ ఫోటో ఇప్పుడు పలు గ్రూపుల్లో తిరుగుతోంది.