Viral Video: హైడ్రాతో హైదరాబాద్‌ ప్రజలను హడలెత్తించి.. దానితో మూసీ నదిని పునరుజ్జీవనం చేస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి దాంట్లో భాగంగా పాదయాత్ర చేపట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామంలో చేపట్టిన మూసీ పునరుజ్జీవన పాదయాత్రలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మూసీ నదిలో ఉన్న భీమలింగానికి పూజలు చేస్తున్న సమయంలో ఒక ఘటన.. పాదయాత్రలో మరో ఘటన చోటుచేసుకోవడం వైరల్‌గా మారాయి. రెండు ఘటనల్లో ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి రేవంత్‌ రెడ్డి శుభవార్త.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు నిర్ణయం


సంగెం గ్రామంలో మూసీ నదిలో ఉన్న భీమలింగానికి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్‌ మూసీ నదిలో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారు గ్రహించి పట్టుకోవడంతో ఆయనను పైకి లాగారు. అతడి కాళ్లు.. బట్టలు తడిచిపోయాయి. అతడికి గాయాలైనట్లు సమాచారం. అయితే అతడు ఏ ఫొటోగ్రాఫర్‌ అనేది తెలియాల్సి ఉంది.

Also Read: KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ సంచలన ప్రకటన


పూజల అనంతరం అక్కడి నుంచి ఫ్లైఓవర్‌ ఎక్కి బయటకు వచ్చి పాదయాత్ర పేరిట రేవంత్‌ రెడ్డి చేపట్టిన రోడ్‌ షోలో కూడా ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. రోడ్‌ షోగా వెళ్తున్న రేవంత్‌, మంత్రులు, ఎమ్మెల్యేల వీడియో.. ఫొటోలు తీస్తున్న క్రమంలో అదుపు తప్పి ఓ ఫొటోగ్రాఫర్‌ బొక్కబోర్లా పడ్డాడు. ఉన్నఫళంగా ఫొటోగ్రాఫర్‌ కిందపడిపోవడంతో నాయకులు విస్తుపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారు అతడిని పైకి లేపారు. అతడి దుస్తులు దుమ్ముదమ్ము అయ్యాయి.


ఇలా రేవంత్‌ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో అపశ్రుతులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌ ఏది చేపట్టినా ఏదో ఒక అపశ్రుతి చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం.. వినాయక చవితి పూజలో ఇలా ప్రతి చోట అపశ్రుతి సంఘటనలు చోటుచేసుకోగా తాజాగా తన పాదయాత్రలో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు గాయపడడం ఆసక్తికరంగా మారింది. తాజా సంఘటనల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి