Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటన. మోదీ పర్యటన సందర్భంగా..భారీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రెండున్నర గంటల ప్రధాని పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవం, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. రెండున్నర గంటలసేపు ప్రధాని హైదరాబాద్‌లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటైంది. ఒక్క గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ప్రాంగణంలోనే 2 వేలమంది పోలీసుల్ని మొహరించారు. పాస్ లేకుండా ఐఎస్‌బీ ప్రాంగణంలో అనుమతి లేదు. 


ప్రధాని పర్యటన వివరాలు ఇలా


ఇవాళ అంటే గురువారం మధ్యాహ్నం 1.25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ తదితర ప్రోటోకాల్ నేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. 


మద్యాహ్నం 1.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఐఎస్ బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొంతమంది విద్యార్ధులుకు స్వయంగా పట్టాలు అందిస్తారు. మద్యాహ్నం 3.20 నిమిషాలకు కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 3.30 గంటలకు హెచ్‌సీయూకు చేరుకుని..అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా బేగంపేటకు చేరుకుంటారు. 3.55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో చెన్నైకు పయనం కానున్నారు. 


ప్రధాని మోదీ పర్యటన పురస్కరించుకుని బేగంపేట నుంచి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మార్గంలో భారీగా స్వాగత తోరణాలు ఫ్లెక్లీలు వెలిశాయి. ముందుగా ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, డా కె లక్ష్మణ్, రాజాసింగ్‌లు మోదీని కలిసే అవకాశాలున్నాయి. కాస్సేపు రాష్ట్ర రాజకీయాలపై కూడా మోదీ చర్చించే పరిస్థితి కన్పిస్తోంది. 


Also read: SSC Exams: తాగుబోతు ఇన్విజిలేటర్... పీకలదాకా తాగి ఎగ్జామ్ హాల్‌కు.. సస్పెండ్ చేసిన విద్యాధికారి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి