మెట్రో ముహూర్తం 28నే
ప్రధాని మోదీ 28న మెట్రో ప్రారంభిస్తారని పిఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.
మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ 28వ తేదీ వస్తారో, రారో అని వార్తలు వస్తున్న వేళ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రధాని కార్యాలయం (పిఎంఓ) నుండి ఒక సందేశం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ప్రధాని మోదీ నవంబర్ 28న మెట్రో ప్రారంభోత్సవానికి హాజరవుతారని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 28వ తేదీనే మెట్రో ప్రారంభోత్సవం నిర్వహించాలని ముందునుంచీ చెబుతూ వస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఒక మంత్రేమో.. 28వ తేదీనే ప్రధాని ప్రారంభిస్తారని.. మరో మంత్రేమో ఇంకా ప్రధాని కార్యాలయం నుండి సమాచారం అందలేదని పొంతనలేని సమాధానం చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ప్రధాని కార్యాలయం నుండి కబురు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ 28వ తేదీన మెట్రో ప్రారంభిస్తారని ఆ లేఖలో పేర్కొనింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ పనులను మరింత వేగవంతం చేసింది.