PM Modi Writes Letter to Gaddar Wife Vimala: ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్  మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని చెప్పారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గద్దర్  పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని అన్నారు. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయని.. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి..!" అని ప్రధాని మోదీ లేఖలో రాసుకొచ్చారు. 


తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్.. అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 6న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఓపెన్ హర్ట్ సర్జరీ ఆపరేషన్ సక్సెస్ అయిన తరువాత ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆయన మరణించారు. గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ లోకం కన్నీరు పెట్టింది.


కాగా.. 2005లో కర్ణాటకలో తనపై పెట్టిన తప్పుడు కేసును కొట్టివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్దర్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తన పని గురించి వివరిస్తూ.. ఎమర్జెన్సీ కాలం నుంచి ఇప్పటి వరకు తనపై అనేక కేసులు బనాయించారని.. అయితే ఇది కర్ణాటకలోని తిరువూరు పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఈ కేసులో వాస్తవాలను ధృవీకరించి.. ఆ కేసును కొట్టేయాలని ప్రధానిని అభ్యర్థించారు. ప్రధాని లేఖ తరువాత గద్దర్ అభిమానులు ఈ లేఖను కూడా గుర్తు చేసుకుంటున్నారు.


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు


Also Read: An Other Agrigold Scam: అధిక వడ్డీ ఆశ చూపించి.. రూ. 1500 కోట్లకు కుచ్చుటోపి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook