Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ.. ప్రయాణ సమయం ఎంతంటే..?
Secunderabad To Tirupati Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభమైంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లోనే చేరుకోవచ్చు.
Secunderabad To Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందే భారత్ రైలు కాగా.. దేశంలో 13వ ట్రైన్. అంతకుముందు బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న మోదీ.. రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాసేపు వందే భారత్ ట్రైన్‌లో తిరుగుతూ.. ట్రైన్ ఉన్న చిన్నారులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ప్లాట్‌ఫామ్‌పై నుంచి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వందే భారత్ ట్రైన్ ప్రారంభంతో ప్రయాణ సయమం మూడున్నర గంటల వరకు తగ్గనుంది. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 12 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 8.30 గంటలు పట్టనుంది. ఈ ట్రైన్‌లో 8 కోచ్‌లు ఏర్పాటు చేయగా.. మొత్తం 530 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగితే కోచ్‌ల సంఖ్య పెంచే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశ ఉంది. ఇక రేట్ల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జ్ 1680 రూపాయలుగా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జ్ 3080 రూపాయలు ఉంది. వారంలో ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు సాగించనుంది.
Also Read: CNG PNG New Price: బిగ్ రిలీఫ్.. గ్యాస్ ధరలు తగ్గింపు.. నేటి నుంచే అమలు
ఛార్జీల వివరాలు ఇలా.. (ఛైర్ కార్ కోచ్‌లో)
==> సికింద్రాబాద్ నుంచి నల్గొండ- రూ.470
==> సికింద్రాబాద్ నుంచి గుంటూరు- రూ.865
==> సికింద్రాబాద్ నుంచి ఒంగోలు- రూ.1075
==> సికింద్రాబాద్ నుంచి నెల్లూరు- రూ.1270
==> సికింద్రాబాద్ నుంచి తిరుపతి- రూ.1680
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీలు ఇలా..
==> సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900
==> సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620
==> సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045
==> సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,
==> సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080
Also Read: IPL 2023 CSK vs MI Playing 11: చెన్నై వర్సెస్ ముంబై ప్లేయింగ్ 11 ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి