IPL 2023 CSK vs MI Playing 11: ఐపీఎల్ 2023లో బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎల్ క్లాసికోగా అభవర్ణించే మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా జరిగే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. రెండూ సీజన్ల నుంచి ఫ్రాంచైజీలో ఉన్న ఇంకా ఆడే అవకాశం దక్కని అర్జున్ టెండూల్కర్ పరిస్థితి ఏంటి..
ఐపీఎల్ 2023 12వ మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఎంఐ అత్యంత కీలకమైన మ్యాచ్. ఇవాళ సాయంత్రం ముంబై వాంఖడే స్డేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఎంఐ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే సీఎస్కే నాలుగు సార్లు గెల్చుకుంది. లీగ్‌లో అతి ప్రధాన ప్రత్యర్ధులు ఈ రెండు జట్లే. అందుకే సీఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్‌ను ఐపీఎల్ ఎల్ క్లాసికోగా పిలుస్తున్నారు. బార్సిలోనా ఎఫ్‌సి వర్సెస్ లాలిగా జయింట్స్ రియల్ మ్యాడ్రిడ్ మ్యాచ్‌కు ఎల్ క్లాసికో పేరు పెట్టారు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా స్డేడియం ప్రేక్షకులతో నిండిపోతుంటుంది. ఇవాళ్టి మ్యాచ్ కూడా ఇందుకు ప్రత్యేకంగా కాదు.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11
ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్లందరూ తుది ఎంపికకు అందుబాటులో ఉన్నారు. ఏప్రిల్2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ తరువాత ముంబై ఇండియన్స్ జట్టుకు విరామం ఎక్కువ లభించింది. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయ మంచి ఎంపిక కావచ్చు. గత ఏడాది 4 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీసి యాజమాన్యాన్ని మెప్పించాడు. ఇంపాక్ట్ బౌలర్ కింద కూడా ఉపయోగపడతాడు.
ఇక ప్రముఖ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గత రెండు సీజన్ల నుంచి ముంబై ఇండియన్స్‌తోటే ఉన్నా ఆడే అవకాశం ఇంకా లభించలేదు. ఈసారైనా అర్జున్ టెండూల్కర్ ఆడే అవకాశం లభిస్తుందా లేదా అనేది సందిగ్దంగా ఉంది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అర్షాద్ ఖాన్ 2.2 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇవ్వాలంటే అర్షద్ ఖాన్ స్థానం ఒక్కటే ఉంది. అర్షద్ ఖాన్ ఘోరంగా విఫలమైతే తప్ప అర్జున్ టెండూల్కర్ ఆడేందుకు అవకాశాలుండవు.
ఎంఐ ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వాథేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాఫ్రా ఆర్చనర్, అర్షద్ ఖాన్
దేవాన్ కాన్వే, రుతురాత్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శివమ్ దూబే, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ఆర్ఎస్ హంగార్గేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook