PM Modi Telangana Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్.. ఎప్పుడు, ఎక్కడ.. పూర్తి వివరాలు
PM Modi Telangana Visit Schedule: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్‌లో రామగుండం బయల్దేరి వెళ్తారు. 3.20 గంటలకు రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. 3.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి 3.30 గంటలకు రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్ వద్దకు చేరుకుంటారు.
PM Modi Telangana Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న శనివారం నాడు తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. 1.35 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి 1.40 గంటలకు పబ్లిక్ మీటింగ్ స్థలానికి చేరుకుంటారు. అక్కడ 1. 40 గంటల నుంచి 2 గంటల వరకు.. 20 నిమిషాల పాటు సమావేశంలో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో 2.5 గంటలకు పబ్లిక్ మీటింగ్ స్థలం నుంచి బయల్దేరి 2.10 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్ లో రామగుండం బయల్దేరి వెళ్తారు. 3.20 గంటలకు రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. 3.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి 3.30 గంటలకు రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్ వద్దకు చేరుకుంటారు. అర్ధగంట పాటు ఆర్ఎఫ్‌సీఎల్ పరిశ్రమలో పర్యటిస్తారు. పరిశ్రమను సందర్శించిన అనంతరం 4.05 గంటలకు పరిశ్రమ నుంచి బయల్దేరి 4.15 గంటలకు సభా స్థలికి వెళ్తారు.
సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు రామగుండంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 5.20 గంటలకు అక్కడి నుంచి వెళ్లి 5.25 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రామగుండం హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.40 గంటలకు సూర్యాస్తమయం కానుండగా అంతకంటే 10 నిమిషాల ముందుగానే MI-17 హెలీక్యాప్టర్ లో రామగుండం నుంచి బయల్దేరి 6.35 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. చీకటి పడే సమయానికి 6.40 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కి ఇప్పటికే లేఖలు వెళ్లాయి. ప్రధాని భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కోసం ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ని సంప్రదించాల్సిందిగా ప్రధాని కార్యాలయం ఆ లేఖల్లో పేర్కొంది. ఇదిలావుంటే, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుండటంతో రాష్ట్రంలో బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay ) సహా బీజేపి నేతలు ఫుల్ జోషలో ఉన్నారు. ఇటీవల కాలంలో అతి కొద్ది వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి తెలంగాణకు వస్తున్నారు. దీంతో బీజేపి నేతలు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు ఈ సందర్భాన్ని పార్టీకి అనుకూలంగా మల్చుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?
Also Read : Thummala Nageswara Rao: టీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్.. తుమ్మల నాగేశ్వరరావు జంప్..?
Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మెయిన్ వికెట్ అవుట్.. తెలంగాణలో కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook