Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?

Delhi Liquor Scam:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది.

Written by - Srisailam | Last Updated : Nov 10, 2022, 01:09 PM IST
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?

Delhi Liquor Scam:  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనాలు జరగబోతున్నాయా? కేసు వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి ప్రచారం సాగుతున్నట్లు తెలంగాణలో కీలక నేత అరెస్ట్ తప్పదా? అంటే రాజకీయ వర్గాలు, ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఈ ఇద్దరు మద్యం వ్యాపారులకు సంబంధం ఉందని ఈడీ వెల్లడించింది. శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబుకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని తెలిపింది. అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్ గా ఉన్నారు శరద్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూపులోని  12 కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు.  మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను  ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది సిబిఐ.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెన్నాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ పాలసికి అనుగుణంగా ఈఎండీలు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్లు గుర్తించింది. సెప్టెంబర్ 21,22,23 తేదీల్లో ఢిల్లీలో  శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించారు ఈడి అధికారులు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ప్రశ్నించారు. తాజాగా అరెస్ట్ చేశారు.

లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన పెన్నాక శరత్ చంద్రారెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి ఆయన సమీప బంధువు. శరత్ చంద్రారెడ్డి సోదరుడు పెన్నాక రోహిత్ రెడ్డి.. విజయసాయి రెడ్డికి అల్లుడు. అంటే సాయిరెడ్డికి శరత్ చంద్రారెడ్డి అల్లుడు. ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని సహా బీజేపీ పెద్దలను ఎప్పుడంటే అప్పుడు కలవగలిగేంత పలుకుబడి ఢిల్లిలో విజయసాయిరెడ్డికి ఉంది. అయినా అతని అల్లుడిని లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి రెడ్డి అల్లుడిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసులో ఎవరిని వదిలే పట్టే ప్రసక్తే లేదని కేంద్రం సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఒక రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది డేంజర్ సిగ్నల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవలే మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాధా ఇండస్ట్రీస్ చైర్మెన్ దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు.అతను ఇస్తున్న వివరాల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారుతారని గతంలో ప్రచారం జరిగింది. కాని దినేష్ అరోరా అప్రూవర్ గా అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటకు వచ్చాయి. తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కీలకంగా ఉన్నారని తేలింది. లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ  కవిత హస్తం ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. తనపై వచ్చిన స్కాం ఆరోపణలను కవిత ఖండించినా.. బీజేపీ నేతలు మాత్రం ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతూ వస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ అధికారులు హైదరాబాద్ లో పలుసార్లు సోదాలు చేశారు. బోయినపల్లి అభిషేక్, శ్రీనివాసరావు, సీఏ బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించారు. వీళ్లంతా ఎమ్మెల్సీ కవిత సన్నిహితులే. దీంతో కవిత టార్గెట్ గానే లిక్కర్ స్కాం విచారణ ముందుకు వెళుతుందనే ప్రచారం సాగుతంది. నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడం.. అరబిందో ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడంతో.. ఈ కేసులో త్వరలోనే సంచలనాలు జరగబోతున్నాయని చెబుతున్నారు. 

Read Also: IND vs ENG Semi-Final Live Streaming: భారత్ vs ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్.. లైవ్ క్రికెట్ స్కోర్ అప్ డేట్స్ ఇవే!

Read Also: Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News