Narendra Modi: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ప్రచారం పతాకస్థాయికి చేరుకునేదశలో బీజేపీ ప్రధాని మోదీని రంగంలో దించుతోంది. అది కూడా ఏకంగా మూడ్రోజుల పర్యటనతో ప్రచారం పీక్స్‌కు తీసుకెళ్లనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీకు ప్రధాన ప్రచారాస్థ్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీనే. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో అంతకంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీతో మూడ్రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణలో ప్రధాని మోదీ ఏకంగా మూడ్రోజులు ప్రచారం నిర్వహించనుండటం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా ఉంది..


ఈ నెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం ఉంటుంది. ఇక 26వ తేదీన తూప్రాన్, నిర్మల్ ప్రాంతాల్లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. అదే విధంగా 27వతేదీన మహబూబాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో బహిరంగసభలుంటాయి. చివరిగా హైదరాబాద్‌లో రోడ్ షో ఉంటుంది. 


ముందుగా ఈ నెల 25వ తేదీ మద్యాహ్నం 1.25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ మద్యాహ్నం 2.05 గంటలకు కామారెడ్డిలో బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 4.05 గంటలకు రంగారెడ్డి జిల్లాలో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 


మరుసటి రోజు అంటే 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ బహిరంసభల్లో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మద్యాహ్నం 12.45 గంటల వరకూ కన్హయ్య శాంతివనంలో కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి మద్యాహ్నం 2 గంటలకు దుబ్బాక సభలో పాల్గొంటారు. మద్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకూ తూఫ్రాన్ సభలో, మద్యాహ్నం 3.45 గంటలకు నిర్మల్ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు తిరుపతి దర్శనానికి వెళ్తారు. 


27వ తేదీ తిరిగి మహబూబాబాద్, కరీంనగర్ సభల్లోనూ, హైదరాబాద్ రోడ్ షోలోనూ పాల్గొంటారు. 27వతేదీ ఉదయం తిరుపతి నుంచి నేరుగా హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నించి మద్యాహ్నం 12.45 గంటలకు మహబూబాబాద్ సభకు హాజరౌతారు. ఆ తరువాత మద్యాహ్నం 2.45 గంటలకు కరీంనగర్ బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల్నించి 6 గంటల వరకూ హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీకు బయలుదేరుతారు. 


మూడ్రోజుల మోదీ పర్యటన తెలంగాణలో బిజీబిజీగా ఉండనుంది. ప్రధాని మోదీ పర్యటనతో భారీగా లబ్ది చేకూరుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


Also read: Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్కపై దాడి.. బోరున విలపిస్తూ కన్నీళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook