Pocharam Srinivas Reddy Breaks Speaker Sentiment: తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ గా పని చేసిన అభ్యర్థులు తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ. 1991 నుంచి అయితే ఏ ఒక్క స్పీకర్ గెలుపొందలేదు. ఆ స్పీకర్ సెంటిమెంట్ కు తాజాగా చెక్ పెట్టారు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచినా.. పోచారానికి మాత్రం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపున బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి 23,582 ఓట్లతో విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన గత ఎన్నికల్లో తెలంగాణ తొలి స్పీక‌ర్ మ‌ధుసూద‌న చారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓటమి పాలయ్యారు.  రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికలలో ఓడిపోయారు. మాజీ సీఎం కిరణ కుమార్ రెడ్డి కూడా స్పీకర్ గా పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సాంప్రదాయానికి తెరదించుతూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మూడోసారి అధికారం చేపట్టాలన్న కేసీఆర్ సర్కారుకు ఊహించిన ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించడంతో ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. 


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook