PM Modi Hyderabad Tour: 930 మంది విద్యార్థులకు 2 వేల మంది పోలీసులు.. మోడీ పర్యటనకు ఎందుకంత భద్రత?
PM Modi Hyderabad Tour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే26 గురువారం హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని పర్యటనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్బీలో దాదాపు రెండు వేల మంది పోలీసులను మోహరించారు. వేడుకలో 930 మంది విద్యార్థులు పాల్గొననుండగా.. 2 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చర్చగా మారింది.
PM Modi Hyderabad Tour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే26 గురువారం హైదరాబాద్ వస్తున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ప్రధాని రాక సందర్బంగా ఐఎస్బీలో దాదాపు రెండు వేల మంది పోలీసులను మోహరించారు. బుధవారమే క్యాంపస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ హాజరుకానున్న ఐఎస్ బీ వేడుకలో 930 మంది విద్యార్థులు పాల్గొననుండగా.. 2 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. అయితే ప్రధాని మోడీ పర్యటనకు గతంలో ఎప్పుడు లేనంతగా భద్రత కల్పించడానికి బలమైన కారణమే ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న గచ్చిబౌలి ఐఎస్ బీ వార్షికోత్సవంలో హైదరాబాద్ తో పాటు మొహాలీ క్యాంపస్ కు చెందిన 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. మొహాలీ విద్యార్థులు ఉండటమే ఇప్పుడు పోలీసులను కలవరపెడుతోంది. గతంలో పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్బంగా కొన్ని సంచలన ఘటనలు జరిగాయి. ప్రధాని మోడీ కాన్వాయ్ ను ఆపేశారు రైతులు. దీంతో చేసిది లేక ప్రధాని మోడీ తిరిగి వెళ్లిపోయారు. రైతుల ఆందోళనతో ముందుకు వెళ్లలేక ప్రధాని వెనక్కి వెళ్లిపోయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఉద్యమించారు. ఢిల్లీ వేదికగా ఏడాదికి పైగా ఆందోళనలు చేశారు. వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై పంజాబీలు ఆగ్రహంగా ఉన్నారు. ఆ ఆగ్రహమే ప్రధాని మోడీ కాన్వాయ్ ను ఆపేసే వరకు వెళ్లింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి షాక్ తగిలింది.
పంజాబీలు ప్రధాని మోడీపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎస్ బీ వేడుకలో మొహాలీ స్టూడెంట్స్ ఉండటంతో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే క్యాంపస్ మొత్తం నిఘా పెట్టారు. విద్యార్థుల కదలికలను గమనిస్తున్నారు. స్టూడెంట్స్ సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక భావాలు ఉన్న విద్యార్థులపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇక ప్రధాని మోడీ పట్టాలు అందించే 10 మంది విద్యార్థుల విషయంలో నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వాళ్ల నేటివిటి , క్యారెక్టర్ వంటి అంశాలను కాలేజీ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని.. పరిశీలించి ఎంపిక చేశారని సమాచారం.
మరోవైపు ఐఎస్ బీ విద్యార్థులపై నిఘా పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది అత్యంత అప్రజాస్వామిక చర్యని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.రాజ్యంగ హక్కులను కేంద్ర సర్కార్ కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. విద్యాసంస్థలపై పోలీసులతో నిఘా పెడితే స్టూడెంట్స్ కు ఏం సందేశం ఇస్తున్నట్లని నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో మోడీ ప్రభుత్వం నియంత పాలనను మరిపిస్తుందని మండిపడ్డారు.
READ ALSO: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook