Hyderabad Gang Rape: హైదరాబాద్ లో జరిగన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గంటకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్ ఖాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అరెస్టైన వారిలో ఒకరు మేజర్ కాగా.. ముగ్గురు మైనర్లు. నాలుగో నిందితుడిని కర్ణాటకలోని గుల్బార్గాలో పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులను ఓ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొయినాబాద్ లోని ఫాంహౌజ్ కు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారని.. అతనికి నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైనర్ బాలికపై పక్కా స్కెచ్ ప్రకారమే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్  అమ్నీషియా పబ్‌లో బాలికతో మాటలు కలిపిన నిందితులు.. అక్కడి నుంచి బేకరీ వద్దకు తీసుకెళ్లి.. తర్వాత మరో కారులోకి మార్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. మైనర్ బాలికతో పాటు నిందితులు కారులో వెళుతున్న వీడియోలు వరుసగా బయటికి వస్తున్నాయి. నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మొదటగా శనివారం మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేశారు. తర్వాత కూడా వరుసగా వీడియోలు వస్తూనే ఉన్నాయి. బయటికి వస్తున్న వీడియోలను పరిశీలించిన పోలీసులు.. ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీశారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన వీడియోలు బయటికి రిలీజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయించారని తెలుస్తోంది. మైనర్లకు సంబంధించి విషయాలను బహిర్గతం చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించారంటూ రఘునందన్ రావుపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.


అమ్నీషియా పబ్ నుంచి బెంజ్ కారులో మైనర్ బాలికను తీసుకెళ్లిన నిందితులు.. బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని కాన్సు బేకరీ దగ్గరకు వెళ్లాక అమెను ఇన్నావోలోకి తీసుకెళ్లారు. తర్వాత బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ రోడ్లపై తిరుగుతూ కారులోనే బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గంట తర్వాత బాధితురాలిని జూబ్లీహిల్స్ పబ్ దగ్గరే వదిలేశారు. అక్కడే ఐదుగురు నిందితులు ఫోటో దిగారు.పార్టీ ముగిసిందని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్భ్ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు అత్యాచార ఘటనలో కీలకంగా వ్యవహరించాని తెలుస్తోంది. బెంజీ కారును డ్రైవ్ చేసింది ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్ ఖాన్ అని వీడియోల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.


ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఘటనకు కారణమైన అమ్నీషియా పబ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. నిందితులు వాడిన బెంజ్, ఇన్నావో కార్లలో ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా కారులో వేలిముద్రలు, తలవెంట్రుకలు, చెప్పులు, బాలిక చెవి రింగులు దొరికాయి. వీర్య నమూనాలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించిందని తెలుస్తోంది. బాలికను మొదటగా తీసుకెళ్లిన మెర్సిడెజ్ బెంజ్ కారులో చెప్పుల జత, షటిల్‌ కాక్‌లు, టేపు, శానిటైజర్‌, మాస్కులు, మొబెల్ ఛార్జింగ్‌ వైర్లు అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ రేప్ కేసు విచారణ అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.


READ ALSO: Hyderabad Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. వీడియోలు షేర్ చేసిన వ్యక్తికి నోటీస్!  


READ ALSO: Hyderabad gang rape case: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణ..దుబాయిలో కీలక నిందితుడు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook