`నోటా` మూవీకి రాజకీయ అడ్డంకులు ; ఇది కుట్రలో భాగమంటున్న హీరో
విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'నోటా' సినిమాపై రాజకీయ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టి.కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందిస్తూ 'నోటా' సినిమా ప్రేరణతో ఓటర్లు ఈవీఎంపై ఉండే నోటా మీటను నొక్కే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఈ మూవీ రిలీజ్ అయితే ఇది ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన ఆరోపించారు. ఈ సినిమాను కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సెన్సార్ బోర్డు సభ్యులు పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
విజయ దేవరకొండ హాట్ రియాక్షన్...
గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ విషయంలో పొంగులేటి సుధాకర్ చేసిన కామెంట్స్ పై హీరో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. ఎన్నికల సమయంలో సినిమా వస్తుండటంతో ఇది చూసే ప్రేక్షకులు 'నోటా' బటన్ నొక్కుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవానికి ఈ మూవీలో అటువంటి విషయాలేవీ ఉండవని వివరణ ఇచ్చాడు..
సినిమా అడ్డుకునేందుకే కుట్ర
'నోటా' విడుదల కాకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని..తన సినిమాపై కక్ష కట్టారని విమర్శించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ 'పబ్లిక్ మీట్' పేరిట ఫ్యాన్స్ కు చేరువ అవతున్న విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ వివాదంపై రియాక్ట్ అయ్యాడు.