All Set To KTR Arrest: ఈ కారు రేసింగ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏ క్షణాన అయినా కేటీఆర్‌ అరెస్ట్‌ ఉండనుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కారు రేసింగ్‌ అంశంపై సుదీర్ఘం చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్ రేస్ అంశంపై గవర్నర్  న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ చేసినట్లు వెల్లడించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ponguleti: ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. ఏపీకి వెళ్లే పరిస్థితి లేదు


మంత్రివర్గ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మంత్రివర్గ సమావేశంలో నాలుగు గంటల పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం చర్చించినట్లు తెలిపారు..  ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందున విచారణ నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి ఈరోజు లేదా రేపు కేసు అప్పగించే అవకాశం ఉందని ప్రకటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఈ కార్ రేస్‌లో వారి స్వార్థం.. స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ముందు తేలనుందని చెప్పారు.

Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌ కార్డులు


'ఫార్ములా ఈ కార్ రేస్‌లో స్వదేశీ డబ్బులు విదేశాలకు ఎలా వెళ్లిందనే దానిపై.. ఆర్‌బీఐ అనుమతి ఉందా అనే దానిపై.. ఒప్పందం తరువాత పేమెంట్ చేసే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి' అని పొంగులేటి తెలిపారు. పేమెంట్ కు అగ్రిమెంట్ కు తేడా ఉందని పేర్కొన్నారు. 'ఈ ఫార్ములా కార్ రేసింగ్‌ నిర్వహణతో రూ.700 కోట్లు వచ్చాయని చెబుతుంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలవాలి' అని కోరారు. భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయని తమ అనుమానం అని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter