హైదరాబాద్: గత కొన్ని రోజులుగా (KTR) కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్  తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి నేడు మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్పై (Revanth Reddy) రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్న కథనాలపై తాను మాట్లాడదలుచుకున్నానని, ప్రతిపక్షంలో ఉంటూ అధికార పీఠంపై అత్యాశ వల్లే ఇలా మాట్లాడుతారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: తెరుచుకోనున్న షాపింగ్ మాల్స్.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం...


గతంలో చంద్రబాబు తొత్తుగా ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో రూ.50 లక్షలు లంచం ఇస్తూ అడ్డంగా పట్టుబడ్డ వ్యక్తి అని, రాజకీయ విలువలు కోల్పాయాడని అన్నారు. కేటీఆర్ పై బురద చల్లే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. 


Also Read: భగ్గుమన్న పెట్రో, డీజిల్ ధరలు..


కాగా ప్రస్తుతం రాజకీయాల్లో ఇద్దరు యువనేతలు నీతికి ప్రతిరూపాలని, వారిలో ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావులని, వీరు నిజాయతీపరులుని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో తెలంగాణకు వీరిద్దరే రెండు కళ్లవంటివారని పోసాని అన్నారు. కేటీఆర్ ను తాను మొదట్నించి గమనిస్తున్నానని, అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ అని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..