భగ్గుమన్న పెట్రో, డీజిల్ ధరలు..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

Last Updated : Jun 7, 2020, 04:22 PM IST
భగ్గుమన్న పెట్రో, డీజిల్ ధరలు..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రీటైలర్ల తాజా నిర్ణయంతో లీటరుకు రూ. 60 పైసలు పెరిగింది. ఇంతకు ముందు మార్చి 16న చివరిసారిగా ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందాల నటి కల్పిక గణేష్ Photos

Also Read:  కరోనాతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ మృతి

మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ప్రతేకమైన‌ ఎక్సైజ్‌ సుంకాన్ని చేయడంతో మార్చి 14న లీటర్ పై మూడు రూపాయలు పెరిగింది. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ ఇంధన రీటైలర్లు నష్టాల బాట పట్టిన నేపథ్యంలో తగ్గిన ధరలతో అమ్మకాలు చేపట్టలేదు.   ఇదిలాఉండగా ప్రముఖ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు హైదరాబాద్‌ లో పెట్రోల్‌ రూ. 74.61, డీజిల్‌ రూ. 68.42, బెంగళూరులో పెట్రోల్‌ రూ. 74.18, డీజిల్‌ రూ. 66.54, చెన్నై పెట్రోల్‌ రూ. 76.07, డీజిల్‌ రూ. 68.7లుగా ఉన్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

 

Trending News