గ్రేటర్ ఎన్నికల ప్రచారబరిలో సినీ ప్రముఖులు రంగంలో దిగారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు శంకర్ లు అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ( Greater Hyderabad Elections ) ల్లో తొలి పర్వం ముగిసింది. ఇంకా స్క్రూటినీ, ఉపసంహరణ మిగిలుంది. అప్పుడే ప్రచారం ఊపందుకుంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ( GHMC Elections )పై అధికారపార్టీకు మద్దతుగా ప్రముఖ రచయిత, నటుడైన పోసాని కృష్ణమురళి ( Posani krishna murali ), దర్శకుడు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ( KCR ) ప్రభుత్వంలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారని పోసాని తెలిపారు. తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాల్ని చూసినా..కేసీఆర్ లాంటి పట్టుదల ఉన్నమనిషిని చూడలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల్ని గెలిపించాలని కోరారు. గతంలో హైదరాబాద్ ప్రాంతంలో మత కలహాలు జరుగుతుండేవని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. నాయకుడు నీతి మంతుడైతే ప్రజలకు కూడా అవే అలవాటవుతాయని...చెప్పారు. గతంలో తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో నీరుండేది కాదని..రైతులకు సమస్యలు ఎదురవుతుండేవని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోసాని కృష్ణ మురళి చెప్పారు. 


ఒక స్పష్టమైన విజన్ తో కేటీఆర్( KTR ) హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారని దర్శకుడు శంకర్ ( Director Shankar ) తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్వేగానికి లోనయ్యారే తప్ప విద్వేషాలను రెచ్చగొట్టలేదని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి సంస్థలు హైదరాబాద్ కు వస్తున్నాయన్నారు. వరదల్ని ప్రభుత్వం సమర్ధవంతగా ఎదుర్కొందని చెప్పారు. Also read: GHMC Elections: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా