KA Paul: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం.. కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం నేనే: కేఏ పాల్
KA Paul slams Telangana CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం అని కేఏ పాల్ అన్నారు.
Praja Shanthi Party President KA Paul sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం అని, సీఎం కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం తానే అని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్‌కి కళ్లు నెత్తికి ఎక్కాయని, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించడానికి తెలంగాణకి వచ్చానన్నారు. ఈరోజు ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాల్ భేటీ అయ్యారు.
కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ... 'తెలంగాణ సీఎం కేసీఆర్ అసమర్ధ పాలన కొనసాగుతుంది. రేపో, మాపో కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం. తెలంగాణ ప్రజలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఉన్నారు. కేసీఆర్‌కి కళ్లు నెత్తికి ఎక్కాయి. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన అంతమొందించడానికి అమెరికా నుంచి తెలంగాణకి వచ్చా. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటా. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం. కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం నేనే' అని అన్నారు .
'సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. 30 స్థానాలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ గెలవలేదు. కేసీఆర్‌కు 30 సీట్లు రావని ప్రశాంత్ కిషోర్ ఆయనతోనే చెప్పారు, నాక్కూడా ఆయనే చెప్పారు. కేసీఆర్ కాదు 18 పార్టీలకు మీరే రావాలని ప్రశాంత్ కిషోర్ నాతో అన్నారు. మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారితో భేటీ అయ్యాను. ఎలాగూ ఇక్కడ బీజేపీ లేదు.. కాంగ్రెస్ నాలుగు ముక్కలైంది. రాష్ట్రంలో కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం ఎవరూ లేరు. అందుకే నేను వస్తున్నా' అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
'32 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ అభివృద్ధి కొరకు పోరాడుతున్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రులుగా ఉన్నారా?. 1989 నుంచి తెలంగాణ అభివృద్ధి కొరకు సంగారెడ్డిలో 11 వందల ఎకరాల్లో బూమ్ కట్టి ఛారిటీలు చేస్తుంటే.. కేసీఆర్ గారికి కళ్లు నెత్తికొచ్చాయి. బంగారు తెలంగాణ అన్నారు.. ఎక్కడుంది బంగారం. ఆయన కుటుంబానికే బంగారం. అప్పుల, అవినీతి తెలంగాణ అయింది. అందుకే ఈడీ , సీబీఐ కేసులతో ఆయన జైలుకు వెళ్లనున్నారు. ఇప్పుడే ఎదో రైతులు అంటూ డ్రామా చేస్తున్నారు' అని కేఏ పాల్ మండిపడ్డారు.
Also Read: Komatireddy: పైసలు ఉంటే ముందే కొనొచ్చుగా.. కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు: కోమటిరెడ్డి
Also Read: Akbaruddin case: నేడే అక్బరుద్దీన్ కేసు తుది తీర్పు.. పాత బస్తీలో భద్రత కట్టుదిట్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook