Komatireddy: పైసలు ఉంటే ముందే కొనొచ్చుగా.. కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy on Paddy Procurement. తెలంగాణ ప్రభుత్వం వద్ద పైసలు ఉంటే ధాన్యంను ముందే కొనొచ్చుగా అని, సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 01:12 PM IST
  • పైసలు ఉంటే వరి ధాన్యం ముందే కొనొచ్చుగా
  • రైతులకు మద్ధతు ధర ఇప్పిస్తాం
  • 12 నెలలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది
Komatireddy: పైసలు ఉంటే ముందే కొనొచ్చుగా.. కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు: కోమటిరెడ్డి

Congress MP Komatireddy Venkat Reddy fires on Telangana CM KCR over Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వం వద్ద పైసలు ఉంటే వరి ధాన్యంను ముందే కొనొచ్చుగా అని, సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతా రెడ్డి, జగ్గా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, నాగం జనార్ధన్‌ రెడ్డి, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌ తమిళితో భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 'రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. కేసీఆర్ కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. వర్షాల కారణంగానే గ్రౌండ్ వాటర్ పెరిగింది. మా టీపీసీసీ పోరాటం వల్లే సీఎం ధాన్యం కొంటా అని ప్రకటన చేశారు. పైసలు ఉంటే ముందే కొనొచ్చుగా.. సీఎం ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు. కేసీఆర్ చేసేదంతా చూస్తుంటే బీజేపీ-టీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామాలాగా కనిపిస్తోంది. రేపో మాపో కేసీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి' అని కోమటిరెడ్డి అన్నారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... 'తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్‌కు  నివేదిక ఇచ్చాము. రైతుల గుండెలు ఆగిపోతుంటే కిశోర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయి.. వాళ్లకు బోనస్ ఇప్పించాలి. 8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయి. 2 వేల 6 వందల కోట్ల విలువైన బియ్యం కపించకపోతే.. సీబీఐ విచారణకు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. 

'రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు, ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారు. ఓడ్లు పాకిస్తాన్ ప్రధాని కొనాలా? అని మోడీని అడుగుతున్నా. రైతుల చావుకు కారణమైన టీఆర్‌ఎస్-బీజేపీని రైతులు ఉరేస్తారు. పంట వేయకుండా పడావు పెట్టిన ఎకరాకు 15 వేల చొప్పున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఓడ్లు-బియ్యం మాయం చేసిన వాళ్లపై సీబీఐ విచారణ చేయాలి. కేసీఆర్ అవినీతిపై వివరాలు ఉంటే ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు?' అని రేవంత్ ప్రశ్నించారు. 

'ధాన్యం కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది. బీజేపీ నేతలకు సిగ్గు లేదు.. లజ్జతప్పి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. కేసీఆర్ మెడలు వంచి రైతులకు మద్ధతు ధర ఇప్పిస్తాం. తక్కువ ధరకు ఏ రైతు కూడా ధాన్యం అమ్ముకోవద్దు. 12 నెలలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది' అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: Beast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. సినిమాపై మిశ్రమ స్పందన..??

Also Read: Harbhajan Vs Dhoni: 'ధోనీ మాత్రమే వరల్డ్ కప్ గెలిస్తే.. మిగతా ప్లేయర్స్ లస్సీ తాగేందుకు వెళ్లారా?'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News