PK-KCR: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహమేంటో..కేసీఆర్ అంతర్గతమేంటో అంతుబట్టడం లేదు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక దాదాపుగా ఖాయమైనా..కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాననడం వెనుక మతలబు అర్ధం కావడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీకే. రాజకీయాల్లో ఉన్నవారికి తెలియందేమీ కాదు. ఇటీవల వారం రోజుల్నించి పీకే పేరు గట్టిగానే విన్పిస్తోంది. కారణం కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం. సోనియా గాంధీతో ఇప్పటికే 2-3 సార్లు సమావేశం పూర్తయింది. త్వరలో పార్తీ తీర్ధం పుచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించనున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్‌తో నడిపిన సంబంధాలు కట్ అవుతాయనే అనున్నారంతా.


అయితే అనూహ్యంగా మరోసారి ప్రశాంత్ కిశోర్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. శనివారం రాత్రి వరకూ విస్తృతంగా ఇరువరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిపై సర్వే ఇచ్చారు. ముందుగ అనుకున్నట్టే టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఈ ఇద్దరి మధ్య ఇవాళ కూడా చర్చలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌తో జరిగిన ఒప్పందం మేరకు..ముందుగా 30 నియోజకవర్గాల సర్వే ఫలితాల్ని పీకే..కేసీఆర్‌కు ఇచ్చారు. ఆ తరువాత మరో 89 నియోజకవర్గాల సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ-పీకే మధ్య జరుగుతున్న చర్చల ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. 


ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైన నేపధ్యంలో మళ్లీ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాననడం వెనుక మతలబేంటో అర్ధం కావడం లేదు చాలామందికి. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా ఉంది. తెలంగాణ పీసీసీ నేత రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ మధ్య గట్టిగానే ఆరోపణలు ప్రత్యారోపణలు విన్పిస్తున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ బలోపేతానికి వ్యూహాలు రచిస్తూ..కాంగ్రెస్ పటిష్టతకు ఎలా పనిచేస్తారనేది ఆసక్తిగా మారింది. 


Also read: Tamilisai Soundararajan: తెలంగాణలో వరుస ఘటనలపై గవర్నర్‌ దృష్టి.. నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.