ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకూ ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017-18 వార్షిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి దరఖాస్తుల సమర్పణకు గడువు విధించినప్పటికీ,  నెలరోజుల్లో ఉపకార వేతనాలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించేలా సంక్షేమ చర్యలు ఊపందుకున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరు అర్హులు? 


* ప్రీమెట్రిక్  ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలోని పిల్లలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా వర్తించనుంది. గ్రామాల్లో చదువుకుంటున్న బడి పిల్లల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణంలో ఆదాయం రూ.2 లక్షలున్న కుటుంబాలు అర్హులుగా ప్రకటించింది. 


* ప్రీ- మెట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకొనే ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా జాతీయ బ్యాంకులో తన పేరుతో అకౌంట్ కలిగి ఉండాలి. విద్యార్థి మైనర్ అయితే జాయింట్ అకౌంట్ లో తనపేరు ఉండాలి. ఆధార్ తప్పనిసరి. 


* దరఖాస్తు విద్యార్ధి ప్రభుత్వ పాఠశాల లేదా స్థానిక సంస్థల ద్వారా నడిచే మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు, మునిసిపాలిటి/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలు లేదా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. 


ఎలా దరఖాస్తు చేయాలి? 


ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ కేటగిరీలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు విధించింది. దరఖాస్తు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థులు ముందుగా ఈపాస్‌ వెబ్‌సైట్‌ లో వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి.  నమోదు చేసిన దరఖాస్తును ప్రింటవుట్‌ తీసి దానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి సంక్షేమాధికారికి సమర్పించాలి. సంక్షేమాధికారి దరఖాస్తును పరిశీలించి ఉపకార వేతనం మంజూరు చేయవలసిందిగా పైఅధికారులకు సిఫార్సు చేస్తారు.  బడి పిల్లలకు దీనిపై అవగాహన ఉండదు కనుక, పాఠశాల హెడ్మాస్టర్ లకు ఈ బాధ్యత అప్పగించాలని సంక్షేమ శాఖ భావిస్తోంది. 



ఉపకార వేతనాలు


* 5-8 తరగతులు (బాలురు)- రూ.1000 


* 5-8 తరగతులు (బాలికలు)- రూ.1500 


* 9,10 తరగతులు- రూ.2500