Rashtrapati: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?
President Droupadi Murmu Two Day Visit To Hyderabad: తెలంగాణ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. యేటా హైదరాబాద్ పర్యటనకు వచ్చే ఆనవాయితీ ఉండడంతో తాజాగా ఈ సంవత్సరం కూడా రాష్ట్రపతి పర్యటన ఉండనుంది.
President Hyderabad Tour: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠతో ఉన్న సమయంలో రాష్ట్రపతి తెలంగాణ పర్యటనకు రానుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రపతి పర్యటన సాధారణ పర్యటనలో భాగంగా రానున్నారని తెలుస్తోంది. ప్రతి యేటా శీతాకాల విడిదిగా తెలంగాణకు రాష్ట్రపతి పర్యటించడం ఆనవాయితీ. శీతాకాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. దేశ ప్రథమ పౌరురాలు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పర్యవేక్షించింది.
Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్ సంచలనం
రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పర్యటన ఈ నెల 21, 22వ తేదీల్లో ఉండనుంది. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో పోలీస్ శాఖ, హోంశాఖ, ఆర్ అండ్ బీ శాఖ, అగ్నిమాపక శాఖలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేపట్టారు. రాష్ట్రపతి నిలయం.. రాజ్‌భవన్ వంటి ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు, బందోబస్తుపై చర్చించారు.
Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్ యాత్రకు ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర
రాష్ట్రపతి పర్యటనను సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి చెప్పారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు అన్ని వేదికల వద్ద అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందితోపాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖకు చెప్పారు. సీఎస్‌తో జరిగిన సమావేశంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి