President Ramnath Kovind to visit Muchinthal Statue of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ఇవాళ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా భద్రవేదిలోని మొదటి అంతస్తులో 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యాహ్నం 3.30గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4గంటలకు రామానుజచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సుమారు గంటన్నర పాటు కోవింద్ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5గం. సమయంలో ముచ్చింతల్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు. సోమవారం (ఫిబ్రవరి 14) ఉదయం 10.30 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు.


రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమ పరిసరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రాక సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి భక్తులకు సమతామూర్తి దర్శనానికి అనుమతించమని పోలీసులు వెల్లడించారు.


కాగా, 54 అంగుళాల ఎత్తు, 120 కిలోల బంగారంతో చేసిన రామానుజచార్యుల విగ్రహాన్ని ముచ్చింతల్‌లోని జీవాశ్రమంలోనే తయారుచేశారు. ఈ విగ్రహ తయారీ కోసం ప్రముఖ వ్యాపారవేత్త మైహోం జూపల్లి రామేశ్వరరావు సహా పలువురు భక్తులు బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. జూపల్లి రామేశ్వరరావు 27 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. భద్రవేదిలో ఈ విగ్రహం కొలువుదీరే అంతస్తును ప్రపన్న శరణాగత మండపంగా పిలవనున్నారు.


Also Read: Sun Transits in Aquarius: కుంభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook