Statue of Equality: ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌లో 'సమతా మూర్తి' విగ్రహాన్ని (రామానుజాచార్యుల విగ్రహం) ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో (హైదరాబాద్ సమీపంలో) నిర్మించిన 216 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని జాతికి అంకితమిచ్చారు. వసంత పంచమి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
రామానుజాచార్యుల 1000వ జన్మదినం సందర్భంగా 12 రోజుల పాటు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగానే నేడు విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా గురువు గొప్పతనం గురించి చెప్పారు ప్రధాని. గురువును దేవుడితో సమానంగా చూడటం భారత దేశ గొప్పదనమని పేర్కొన్నారు.
రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అన్నారు ప్రధాని.
సమతామూర్తి విగ్హరం చుట్టూ ఏర్పాటు చేసిన 108 ఆలయాలను సందర్శించినట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఇదో ప్రత్యేకమైన అనుభూతి అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి ఈ ఒక్క చోటే లభించిందన్నారు.
Telangana | Prime Minister Narendra Modi inaugurates the 216-feet tall 'Statue of Equality' commemorating the 11th-century Bhakti Saint Sri Ramanujacharya in Shamshabad pic.twitter.com/dxTvhQEagz
— ANI (@ANI) February 5, 2022
విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రధాని మోదీతో చిన జీయర్‌స్వామి విశ్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారు. మరిన్న ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. ఈ యజ్ఞం ఫలాలు 130 కోట్ల భారతీయులకు అందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Also read: ICRISAT: 50 ఏళ్ల అనుభవంతో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి: ఇక్రిశాట్లో ప్రధాని మోదీ
Also read: TSRTC ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook