PM Modi: తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పేరు ఎంతకుండా మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రసంగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్ మంత్రంతో తెలంగాణలో అభివృద్ధి చేస్తామన్నారు. 8 ఏళ్లుగా అన్ని వర్గాలకు సంక్షేమం అందించామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు ప్రధాని మోదీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని..అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించారని గుర్తు చేశారు. 


రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని..హైవేలను అభివృద్ధి చేశామన్నారు. రిజినల్ రింగ్ రోడ్డు సైతం భారీ స్థాయిలో నిర్మించబోతున్నామని తెలిపారు ప్రధాని. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన తెలంగాణ గడ్డ గురించి వివరించారు. అధికారంలోకి వస్తే ఏ ఏ పథకాలు తీసుకొస్తామో వివరించారు.


Also read:Actress Arrested: రెచ్చిపోయి పోలీసాఫీసర్ ను కరిచిన నటి.. అసలు ఏమైందంటే?!


Also read:Pakistan Accident: పాకిస్థాన్‌లో మృత్యులోయ.. 19 మంది మృతి..11 మందికి గాయాలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook