Priyanka Gandhi Hyderabad tour:  కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొననున్నారు. అయితే ఈ నెల 05న ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నట్లు టీ-కాంగ్రెస్ ముందే ప్రకటించింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆమె షెడ్యూల్ ను మార్చింది. దీని ప్రకారం, ప్రియాంక ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. ఇదే రోజు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని.. ఢిల్లీ వెళ్లే ముందు హైదరాబాద్ వస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. అందుకే ఏఐసీసీ తాజాగా ప్రియాంక షెడ్యూల్ ఖరారు చేసింది. గతంలో ప్రియాంకతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించినప్పటికీ అవి సఫలం కాలేదు. 


Also Read: Karnataka next CM: కర్ణాటకలో బీజేపి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు


రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై పోరాడటం ద్వారా యువతను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దానికి అనుగుణంగానే పావులు కదుపుతోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయినా నేపథ్యంలో దానిని అదునుగా చేసుకుని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని హస్తం పార్టీ యోచిస్తోంది. మరోవైపు ఆగిపోయిన పాదయాత్రను మెుదలుపెట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి రెడీ అవుతున్నారు. మే 9వ తేదీ నుంచి రెండో విడత “హాథ్‌ సే హాథ్‌ జోడో” యాత్రను 32 నియోజక వర్గాల్లో చేపట్టనున్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 


Also Read: Afzal Ansari: కిడ్నాప్, హత్య కేసుల్లో బీఎస్పీ ఎంపీకి 4 ఏళ్లు జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook