Rajanna Sircilla: కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను.. టీఆర్ఎస్ వెనక్కి తీసుకుంటోంది!
Rajanna Sircilla: గత ప్రభుత్వం ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన స్థలాల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనే ఆరోపణలతో.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయం కోసం రోడ్డెక్కారు. వారికి బీజేపీ మద్ధతు ప్రకటించింది.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ పంచాయితీ పరిధిలో కొంత మంది జనం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. 2014కు ముందు ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ జరుగుతోందని నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు.
నోటీసులు..
తమ ఇళ్ల స్థలాలను వెనక్కి ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఇటీవల నోటీసులు కూడా వచ్చినట్లు చెప్పారు ఆందోళన చేస్తున్న వ్యక్తులు. ఈ విషయంపై ఎంఆర్ఓను సంప్రదిస్తే.. అది ఆర్డీఓ ఆర్డరని చెప్పినట్లు వివరించారు. ఆ స్థలాల్లో ఇంతవరకు ఇళ్లు కట్టుకోనందువల్లే స్థలాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కూడా చెబుతున్నారని తెలిపారు.
లోన్లు ఇస్తే ఇళ్లు కట్టుకుంటాం కదా..?
అయితే ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారని.. వారికి లోన్లు ఇస్తే ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటామని చెబుతున్నారు. ఇక పట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైన కారణంగానే రోడ్డెక్కినట్లు చెప్పారు.
ఈ నిర్ణయంతో వెయ్యి మందికిపైగా పేదలకు నష్టం జరుగుతుందని వాపోయారు. ఈ నిరసనల్లో మహిళలు కూడా పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన జరుగుతుందని తేల్చి చెప్పారు. ఇళ్ల పట్టాలకోసం చేస్తున్న ఈ ఆందోళనలకు స్థానిక బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని తెలిపారు.
రోడ్డుపైకి చేరి జనం నిరసనలు తెలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..
మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వెంకటాపూర్‌లో రెండు పడకల ఇళ్లను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో తంగళ్లపల్లి మండలంలో ఇళ్లపట్టాలను వాపస్ తీసుకునే విషయంపై ప్రజలు రోడ్డెక్కడం గమనార్హం.
Also read: Mohan babu controversy: నటుడు మోహన్ బాబు క్షమాపణకు నాయి బ్రాహ్మణుల డిమాండ్
Also read: Cockfight in Telangana: తెలంగాణలోనూ రహస్యంగా కోడి పందాలు.. 28 మంది అరెస్ట్.. ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook