గోపీచంద్‌కి క్వారంటైన్ స్టాంప్.. స్పందించిన బ్యాడ్మింటన్ కోచ్
నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Pullella Gopichand under quarantine ) పడింది. 14 రోజుల పాటు ఆయన ఇంట్లోంచి బయటకు రాకూడదంటూ తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ అధికారులు గోపీచంద్ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Quarantine stamp ) వేశారు.
హైదరాబాద్ : నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Pullella Gopichand under quarantine ) పడింది. 14 రోజుల పాటు ఆయన ఇంట్లోంచి బయటకు రాకూడదంటూ తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ అధికారులు గోపీచంద్ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Quarantine stamp ) వేశారు. దీంతో రెండు వారాలపాటు గోపీచంద్ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ( Also read : 54 వేల మంది ప్రయాణికులు రూ.10 కోట్ల విలువైన టికెట్స్ కొనుగోలు )
ఇదే విషయమై గోపీచంద్ జీ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న తన బామ్మను చూడటానికని మే 11న తాను గుంటూరులో వెళ్లానని.. అక్కడి నుంచి తిరిగొచ్చే క్రమంలో ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ అధికారులు తనను పరీక్షించి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేశారని తెలిపారు. తనకు ఎటువంటి కరోనావైరస్ లక్షణాలు లేవని.. అయినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలు, చట్టాన్ని గౌరవిస్తూ ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరిస్తానని గోపీచంద్ అన్నారు.
దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకే 70,000 దాటగా 2,300 మంది కరోనాబారిన పడి చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..