ఊహించిన తీరుగానే దుబ్బాక ఉప ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఈవీఎంలలో తొలి రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లలో అధికార ఆధిక్యంలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ రేసులోకి వచ్చింది. 



 


బీజేపీ నేత రఘునందన్‌రావు రెండో రౌండ్ తర్వాత 1,135 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో బీజేపీకి 3,208 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 2,867, కాంగ్రెస్‌ అభ్యర్ధికి 648 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థికే అధికంగా ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు 1,561 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి 1,282 ఓట్లు సాధించారు. నవంబర్ 3న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది. దుబ్బాకలో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 



 


తొలి రౌండ్‌లో


బీజేపీకి 3,208


టీఆర్‌ఎస్‌కు 2,867


కాంగ్రెస్‌ అభ్యర్ధికి 648


 


రెండో రౌండ్‌లో  


బీజేపీకి 1,561


టీఆర్ఎస్‌కు  1,282


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe