Dubbaka Bypoll: KTR interesting tweet: హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల వేడి నెలకొంది. ప్రచారంలో ప్రాధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటల తూటాలతో విమర్శించుకుంటున్నాయి. మరికొన్నిగంటల్లోనే దుబ్బాక ఎన్నికల (Dubbaka Bypoll) ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (K. T. Rama Rao) ఆసక్తికరమైన ట్విట్ చేశారు. ఏటా తెలంగాణ (telangana) నుంచి కేంద్రానికి చెల్లించిన పన్నులు, కేంద్రం (Central Govt) నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులపై (Funds) గణాంకాలతో సహా పంచుకుంటూ.. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలంటూ.. మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఈ విధంగా రాశారు..
The people of Telangana should know that since 2014, our state’s contribution to Centre in the form of taxes is a whopping ₹2,72,926 Cr whereas what Centre has released to Telangana is ₹1,40,329 Cr!
Telangana continues to be a pillar of strength for India 💪#TelanganaEconomy pic.twitter.com/07UANGDQe3
— KTR (@KTRTRS) November 1, 2020
2014 నుంచి పన్నుల రూపంలో 2 లక్షల 72వేల 926 కోట్ల రూపాయలను తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించామని ఆయన వివరించారు. అయితే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 1లక్షా 40వేల 329 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ విజయవంతమైన పాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొంది. ఈ సందర్భంగా కేటీఆర్ 2014 నుంచి 2020 వరకు ఏటా తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించిన పన్నులు, అదేవిధాంగా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల గణాంకాలతో సహా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. Also read: Dubbaka Bypoll Campaign: నేటితో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి తెర
అయితే.. గత కొన్నిరోజుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రం నుంచే ఎక్కువగా నిధులు వస్తున్నాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై నిన్న సీఎం కేసీఆర్ (KCR) సైతం స్పందించారు. ఈ క్రమంలోనే దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెరపడుతుందనంగా కేటీఆర్ ట్విట్ చేయడం పట్ల ప్రధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఉపఎన్నిక 3వ తేదీన (మంగళవారం) జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe