Rahul Gandhi Bharath Jodo Yatra: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఐదవ రోజు జడ్చర్ల నుంచి ప్రారంభమైంది. ఆదివారం మొత్తం 22 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి మొదలైన రాహుల్ గాంధీ యాత్ర.. ఆదివారంతో 53వ రోజుకు చేరింది. మధ్యాహ్నం పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం ఇవ్వనున్నారు. తర్వాత యాత్ర ప్రారంభించి  సాయంత్రానికి షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం రాహుల్ గాంధీ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ ముందుకు సాగారు రాహుల్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. పిల్లలతో కలిసి వేగంగా పరుగెత్తారు. పోటాపోటీగా రన్ చేసినా రేసులో రేవంత్ రెడ్డి వెనకబడ్డారు. వేగంగా పరుగెత్తి ముందు నిలిచారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, రేవంత్ వెంట పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ షబ్బీర్ అలీ కూడా పరుగెత్తారు. అయితే వాళ్లిద్దరు రేవంత్, రాహుల్ తో పరుగెత్తలేకపోయారు.



అంతకుముందు రాత్రి తన బస చేసిన ప్రాంతంలో ఉదయం బతుకమ్మ ఆడారు రాహుల్ గాంధీ. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటం వేస్తూ ఆడిపాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో కలిసి సరదాగా బతుకమ్మ ఆడారు. రాహుల్ తమతో కలిసి ఆడటంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తనతో బతుకమ్మ ఆడిన మహిళలతో మాట్లాడారు రాహుల్. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి