Yadadri Temple News: యాదాద్రిలో కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆలయ పురవీధుల్లోకి పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తింది. వర్షం బారి నుంచి తలదాచుకునేందుకు భక్తులు తలా ఒక చోటుకు అన్నట్టుగా పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ కొద్దిపాటి వర్షానికే ఘాట్‌ రోడ్డు పూర్తిగా బురదమయం అయిపోయింది. దీంతో యాదాద్రి దర్శనానికి వచ్చిన భక్తులు.. కోట్లు పెట్టి నిర్మించిన ఆలయంలో కనీస వసతులు లేకపోతే ఎలా అని విస్మయం వ్యక్తంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, మరోవైపు వర్షం కారణంగా కొండపైనే కాదు.. కొండ కింద ఉన్న పార్కింగ్ ప్రదేశంలోనూ భక్తులు అవస్థలు పడాల్సి రావడం మరింత విస్మయానికి గురిచేసింది. పార్కింగ్ లాట్ లో నిలిపి ఉన్న కార్లు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. పార్కింగ్ ప్రదేశం అంతా జలసంద్రమైపోయింది. భారీగా నీరు చేరడంతో భక్తుల వాహనాలు నీటమునిగాయి. 


వర్షం నీరు వెళ్ళుటకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొండపై నుంచి వచ్చిన వర్షం నీరు పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తిందని.. దీంతో తమ వాహనాలు పార్కింగ్ చేయడానికైనా లేదా పార్కింగ్ చేసిన వాహనాలు తిరిగి తీసుకోవడానికైనా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని భక్తులు వాపోయారు. ఇంత చిన్న వర్షానికే ఇలా అయితే, రేపు రేపు వర్షా కాలంలో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే అప్పుడు భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 


ఇది కూడా చదవండి : Revanth Reddy: కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా పాపాలు పోవు.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు


యాదాద్రి దేవాలయం పునఃనిర్మాణం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేసినప్పటికీ .. పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉందేంటి అని కొంతమంది భక్తులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి పనుల్లోనూ నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని విమర్శిస్తున్నారు. మరి ఇకనైనా ప్రభుత్వం తేరుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఆలయ ప్రతిష్టను కాపాడుతుందా లేక ఇలాగే గాలి వానలకు వదిలేస్తుందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరికను కన్ఫార్మ్ చేసిన పొంగులేటి.. మా మధ్య సీట్లు ఒప్పందం లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK