Ponguleti Srinivas Reddy - Bhatti Vikramarka: కాంగ్రెస్‌లో చేరికను కన్ఫార్మ్ చేసిన పొంగులేటి.. మా మధ్య సీట్లు ఒప్పందం లేదు

Ponguleti Srinivasa Reddy-Bhatti Vikramarka Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 12:38 PM IST
Ponguleti Srinivas Reddy - Bhatti Vikramarka: కాంగ్రెస్‌లో చేరికను కన్ఫార్మ్ చేసిన పొంగులేటి.. మా మధ్య సీట్లు ఒప్పందం లేదు

Ponguleti Srinivasa Reddy - Bhatti Vikramarka Meeting: కాంగ్రెస్‌లో చేరికను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ఫార్మ్ చేశారు. వడదెబ్బతో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గురువారం ఆయన కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను నిర్వహిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వంద రోజుల్లో 1150 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని అభినందించారు. వడదెబ్బకు గురై అస్వస్థత చెందిన భట్టిని పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. 

"తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే ఎవరితో సాధ్యమో అందరికీ తెలుసు. ఆ కలలు నెరవేర్చడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర నూటికి నూరు శాతం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. సీఎం కేసీఆర్ మాయ మాటలతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చలేదు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యం. 100 శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తి కేసీఆర్.. తెలంగాణ అమరవీరుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా అమలు చేయలేదు. 

ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలు చేయకుండా  దగా చేసిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు క్షమించరు. చేరికల సమయంలో మా మధ్య సీట్లు ఒప్పందం లేదు.. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పని చేస్తాం. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో.. వద్దో  నేను చెప్పే వ్యక్తిని కాదు.." అని పొంగులేటి అన్నారు.

Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం

మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్వాగతిస్తున్నామన్నారు. భట్టి విక్రమార్క ఆరోగ్యం కోలుకున్న తర్వాత సూర్యాపేటలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు  ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యం అందరిది అని.. అందుకోసం ఐక్యంగా పనిచేసి అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News