Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వాన పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు రోడ్లపై ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సోమాజిగూడ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంతోపాటు పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాగుట్ట, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంక్ బండ్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్ పూర్, అత్తాపూర్, జాగీర్, మణికొండ, నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.


Also read:CM Jagan: రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్..పట్టు వస్త్రాల సమర్పణ..!


Also read:YS Sharmila: టీఆర్ఎస్‌కు ఆయనో కోవర్ట్..జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల ధ్వజం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook