YS Sharmila: టీఆర్ఎస్‌కు ఆయనో కోవర్ట్..జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల ధ్వజం..!

YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 26, 2022, 05:34 PM IST
  • జగ్గారెడ్డి వర్సెస్ బీజేపీ
  • జగ్గారెడ్డిపై షర్మిల ఫైర్
  • తాజాగా ఘాటు వ్యాఖ్యలు
YS Sharmila: టీఆర్ఎస్‌కు ఆయనో కోవర్ట్..జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల ధ్వజం..!

YS Sharmila: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి..మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ పార్టీ మారాడా..ఎప్పుడు మారాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ గెలిచిన పార్టీయే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. పార్టీలు మారే అలవాటు వైఎస్‌ఆర్‌కు లేదన్నారు.

జగ్గారెడ్డిలా పార్టీలు మారి నీచ రాజకీయాలు చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదని స్పష్టం చేశారు. పొద్దున టీఆర్ఎస్, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్‌..ఎవరు పిలిస్తే అక్కడికి పోతావు అని ఆరోపించారు. ఎవరికీ కథలు చెబుతున్నారని విమర్శించారు. ఒకరోజైనా ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించావా అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజల కోసం ఒక్కరోజైనా పని చేశావా అని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ మంత్రి ఒకరు సంగారెడ్డి ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారని..ఆ తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దీనిపై ఎందుకు పోరాడలేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల. మీ వల్ల లాభం లేని సంగారెడ్డికి జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఎంత..లేకుంటే ఎంత అని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు..రేపు ఏ పార్టీలో ఉంటావో తనకే క్లారిటీ లేదన్నారు. అలాంటి వ్యక్తి తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల.

ఇవాళ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..సీఎం వైఎస్ జగన్, షర్మిలపై మండిపడ్డారు. ఆమె ఎందు కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. నాయకులను తిట్టేందుకు..వ్యక్తిగతంగా బురద చల్లేందుకు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ కుమార్తె అయినంత మాత్రన విమర్శిస్తే ఊరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. తండ్రి వైఎస్‌ఆర్ బాటలో ఆమె నడవడం లేదన్నారు. బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్, షర్మిల నడుచుకుంటున్నారని ఆరోపించారు.

వీరిద్దరూ బీజేపీ వదిలిన బాణాలేనని విమర్శించారు. మోదీ, అమిత్ షా చెప్పినట్లు జగన్, షర్మిల నడుచుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఓట్లను చీల్చి బీజేపీకి ఉపయోగపడాలనేదే వారి ఉద్దేశమన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు.  

Also read:IND vs AUS: అనారోగ్య సమస్య ఉన్నా..హైదరాబాద్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్..!

Also read:CM Jagan: రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్..పట్టు వస్త్రాల సమర్పణ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News