Rakesh Tikait: కేసీఆర్, టీఆర్ఎస్పై రాకేశ్ టికాయిత్ సంచలన వ్యాఖ్యలు
Rakesh Tikait on KCR: రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా లేదని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. హైదరాబాద్మహాధర్నాలో పాల్గొన్న టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rakesh Tikait on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రతినిధి రాకేశ్ టికాయిత్. బీజేపీకి టీఆర్ఎస్ 'టీమ్ బీ' అని అభివర్ణించారు.
రైతు ఉద్యమంపై టీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా లేదని ఆరోపించారు టికాయిత్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకేనని (Rakesh Tikait fire on KCR) విమర్శించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల.. రైతులు ఆందోళన చెందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం (Rakesh Tikait over Telangana farmers) చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు అండగా ఉంటానని చెప్పారు.
నూతన సాగు చట్టాల రద్దును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్‌తో.. హైదరాబాద్‌లో నేడు మహాదర్న (Rakesh Tikait at Hyderabad Maha Dharna) కొనసాగుతోంది. ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రాకేశ్ టికాయిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు వివిధ రైతు సంఘాల నేతలు సహా పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.
పరిహారం కోసం డిమాండ్..
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టికాయిత్. ఈ సందర్భంగా రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది పేర్కొన్నారు టికాయిత్. భాషలు వేరైనా.. భావన ఒకటెనని స్పష్టం చేశారు.
Also read: Father rapes Daughter: కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి..ఆ విషయం తల్లికి తెలిసి...
సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన..
గత ఏడాది తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్నారు. దీనితో వారి నిరసనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకునేందుకు (New Farm Laws) సిద్ధమైంది. గురునానక్ జయంతి సందర్భంగా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (PM Modi on New Farm laws) ప్రకటించారు. రానున్న పార్లమెంట్ సెషన్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో.. నూతన సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది.
Also read: Pocharam Srinivas reddy: తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా...ఆస్పత్రిలో చేరిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook