Father rapes Daughter: కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి..ఆ విషయం తల్లికి తెలిసి...

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 10:51 AM IST
Father rapes Daughter: కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి..ఆ విషయం తల్లికి తెలిసి...

Father rapes Daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. అండగా నిలబడాల్సిన వాడే అత్యాచారం చేశాడు. జీవితాన్ని ఇచ్చినవాడే ఆ లైఫ్ ను నాశనం చేశాడు. కూతురుపైనే కన్న తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తెలంగాణ వికారాబాద్‌ జిల్లా(Vikarabad district) మోమిన్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే...
వికారాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం పటాన్‌చెరు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బాలో చదువుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వచ్చేసింది. తండ్రి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న కూతురును బెదిరించి మూడు నెలలుగా లైంగిక దాడి(Father rapes Daughter)కి పాల్పడుతున్నాడు.

Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీలో నష్టం...పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..

బాలిక నాయనమ్మ మృతి చెందడంతో తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వచ్చి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నారు. కూతురు(Daughter) నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక గర్భం(Pregnancy) దాల్చిందని చెప్పారు. ‘'ఎవరినైనా ప్రేమించావా..చెప్పు. వారి పెద్దలతో మాట్లాడి నీకు పెళ్లి చేస్తామని' గట్టిగా నిలదీసింది. పటాన్‌చెరులో ఉన్నప్పుడు తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కూతురు చెప్పడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. మంగళవారం రాత్రి తల్లి మోమిన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News