హైదరాబాద్ అంబర్ పేట ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం ఒళ్లు జలదరించేలా ఉంది. ఎవరినైనా కంట తడి పెట్టించే ఈ వీడియోపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందన విమర్శలకు తావిస్తోంది. అందుకే ఆర్జీవీ ఇప్పుడు ఆమెను టార్గెట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగేళ్ల పిల్లాడిపై వీధికుక్కలు దాడి చేసి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదారు కుక్కలు అత్యంత క్రూరంగా బాలుడిని వేటాడాయి. ఆ సీసీ టీవీ ఫుటేజ్ అత్యంత భయంకరంగా ఉంది. ఎవరో ఉసిగొల్పినట్టుగా ఆ కుక్కలు బాలుడిపై విరుచుకుపడ్డాయి. ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఆ పసివాడు ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనను తెలంగాణా హైకోర్ట్ సీరియస్‌గా పరిగణించి..సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. హైదరాబాద్ కలెక్టర్, కమీషనర్‌లతో పాటు సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చింది. పిల్లాడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసు మార్చి 16కి వాయిదా వేశారు.


పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే..హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఆకలి తట్టుకోలేక ఆ వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయని చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుక్కలు అలా ప్రవర్తించడానికి ఆమె కారణాలు తెలిపారు. ఒక మహిళ ఆ కుక్కలకు రోజూ మాంసం ఆహారంగా పెట్టేది. ఆమె రెండు రోజుల లేకపోవడం వలన మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు పిల్లాడిపై దాడి చేశాయన్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని సలహా ఇచ్చారు.


మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అందుకే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెపై గట్టిగానే సెటైర్లు విసిరాడు. కుక్కల దాడి వీడియో షేర్ చేస్తూ..కేటీఆర్ గారిని అడ్రస్ చేస్తూ ట్వీట్ చేశాడు. 


ఆర్జీవీ ట్వీట్ ఇలా


నాకు ఏ డిపార్ట్‌మెంట్ దేనికనే ఐడియా లేదు. మేయర్ గారిని మీరు నియమించారా లేదా అనే పొలిటికల్ సిస్టమ్ కూడా తెలియదు. కానీ మేయర్ గారి కాంపౌండ్‌లో ఓ 5 వేల కుక్కల్ని పంపి..అన్నవైపుల్నించి గేట్లు మూసేయండి. అప్పుడు ఆ 5 వేల కుక్కలపై ఆమె ఎలా ప్రేమ చూపిస్తుంది, ఎంత ప్రేమ చూపిస్తుందనేది, ఎలా తిండి పెడుతుందనేది నేనొక్కడినే కాదు..దేశం మొత్తం చూస్తుంది. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. డీఏ ప్రకటన అప్పుడే.. పూర్తి లెక్కలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook