Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్
Hyderabad on Red alert due to heavy rains: హైదరాబాద్: ఇప్పటికే నిత్యం పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో సతమతం అవుతున్న హైదరాబాద్‌లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు నగరానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Hyderabad on Red alert due to heavy rains: హైదరాబాద్: ఇప్పటికే నిత్యం పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో సతమతం అవుతున్న హైదరాబాద్‌లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు నగరానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు నగరానికి ఆనుకుని ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎనిమిది గంటల పాటు ఎడతెరిపిలేకుండా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇటీవల నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Hyderabad rains) హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నాలాలు నిండుగా పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారులు పూర్తిగా నీటిమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
Also read: Heavy rains in Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు: IMD
ఇదిలావుండగానే ఇవాళ మరోసారి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Also read: Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook