తెలంగాణ ఎన్నికలు: ఖమ్మం జిల్లా వైరా నుండి పోటీ చేస్తున్న టాలీవుడ్ నటి
ఈ రోజుల్లో, జైశ్రీరామ్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేష్మా రాథోడ్ తెలంగాణ ఎన్ని్కల్లో ఖమ్మం జిల్లా వైరా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ఈ రోజుల్లో, జైశ్రీరామ్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేష్మా రాథోడ్ తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 29 ఏళ్ల రేష్మా రాథోడ్ అసలు పేరు భూక్యా రేష్మాబాయ్. బీజేపీ నుండి బరిలోకి దిగుతున్న రేష్మా గతంలో సింగరేణిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. పదిహేనేళ్ల వయసులోనే బీజేపీ యువ మోర్చా కార్యకర్తగా సేవలందించారు. రేష్మా తల్లి రాధాబాయ్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. రేష్మా కూడా తొలుత లా కోర్సు చేసి న్యాయవాదిగానే తన కెరీర్ కొనసాగించాలని భావించారు.
కానీ టీవీ దర్శకురాలు మంజులా నాయుడు రేష్మాను చూసి టెలివిజన్ సీరియల్స్‌లో నటించమని అడిగారు. అలా ‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రేష్మా.. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలలో నటించారు. అయితే తొలిసారిగా ఆమెకు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన "ఈ రోజుల్లో" చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో తనకు మరికొన్ని చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
‘భారతీయ జనసంఘ్’ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రంలో ప్రస్తుతం రేష్మా, ఆయన సతీమణి సుధాదేవిగా నటిస్తున్నారు. భారతీయ జనతా యువ మోర్చా (బి.జె.వై.ఎం) తెలంగాణ కార్యదర్శిగా కూడా గతంలో రేష్మా పనిచేశారు. తండాల్లో పదోతరగతి అవ్వక ముందే బాలికలకు పెళ్లిళ్లు చేసి పంపించేసే పద్ధతులు ఉన్నాయని.. అవి మారేలా తాను ప్రయత్నిస్తానని.. అలాగే తాను డబ్బు కోసమో, హోదా కోసమో రాజకీయాల్లోకి రాలేదని అంటున్నారు రేష్మా.