Ration Card: రేషన్ కార్డు లేనివారికి బంపర్ ఆఫర్.. వారికి కూడా ఈ పథకం వర్తింస్తుందట..
Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు.
Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పథకాల లబ్దికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో పథకాలు తమకు అమలు కావేమో అనే ఆందోళనలో ఉన్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అర్హులైనవారికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పథకాల అమలుకు కృషి చేస్తామని గతంలో అన్నారు. ఆరోగ్య శ్రీ కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా జారీ చేయాలని భావిస్తున్నామన్నారు.ఈనేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో కొత్త కార్డులను జారీ చేయనుందట. ఇది అన్ని వర్గాలనవారికి వారి ఆదాయంతో సంబంధం లేకుండా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీం ద్వారా 1670 చికిత్సలు ఈ పథకం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని చికిత్సలు అందుబాటులోకి తీసుకురానుందట.
అయితే, కీలక గ్యారెంటీలు రూ.500 సిలిండర్, 200 యూనిట్ల కు ఉచిత కరెంటుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. గత పదేళ్లుగా రేషన్ కార్డు జారీలు అంతగా చేయకపోవడంతో చాలామంది ప్రజలు కొత్తరేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు గ్యారెంటీలు అమలు కావేమో అని ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కేవైసీ కూడా పొడిగించారు. ఆ తర్వాత మార్చి నుంచి కొత్తరేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని అంచనా వేశారు. అయితే, కేవైసీ చేయకపోతే కార్డులో వారి పేర్లను తొలగించనున్నారు. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అర్హులైనవారికి కచ్చితంగా అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. ఈనెలలో కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి: ముస్లింలకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదు. భయపడవద్దు
అర్హులైన వారందరూ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అర్హులైన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అప్లికేషన్స్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న వారు రేషన్ కార్డు కోసం స్థానిక మీ సేవా కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: మహిళల అరాచకం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై దాడి
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉండగా.. వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం రేషన్ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇతర రిక్వెస్టులు కలిపి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి. మిగిలిన 1,05,91,636 దరఖాస్తులు ఐదు గ్యారంటీలకు సంబంధించినవి ఉన్నాయి. గతంలో మాదిరిగానే మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు సమాచారం. రేషన కార్డులు ప్రజలకు అత్యంత ప్రధానం కావడంతో సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook